CONTENTCARRY


AP 10th Class with 9 papers| New Exam Pattern/ changes in 2015

 

ఇకపై ‘పది’లో 9 పరీక్షలు

* హిందీలోనూ 35 శాతం మార్కులు వస్తేనే ఉత్తీర్ణత

* తొమ్మిదో తరగతిలోనూ ఇదే విధానం

ఈనాడు- హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి (2014-15) పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో సంస్కరణలు రాబోతున్నాయి. ప్రస్తుతం ఉన్నట్లు 11కు బదులు 9 పరీక్షలు మాత్రమే ఉంటాయి. ఇదే విధానం తొమ్మిదో తరగతి పరీక్షల్లోనూ అమలుచేస్తారు. నిర్బంధ ఉచిత విద్యా హక్కు చట్టం-2009, జాతీయ విద్యా ప్రణాళిక చట్రం- 2005, రాష్ట్ర విద్యా ప్రణాళిక పరిధి పత్రం-2011 ప్రకారం ఒకటి నుంచి పదో తరగతి వరకు పాఠ్యపుస్తకాలను ఆధునికీకరించారు. ఇందులో భాగంగానే పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో సంస్కరణలు అమల్లోకి రాబోతున్నాయి. వీటిపై విద్యార్థుల్లో అవగాహన తీసుకువచ్చేందుకు తొమ్మిదో తరగతి నుంచే ఈ సంస్కరణలను అమలు చేయనున్నారు.

* ప్రస్తుతం పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ద్వితీయ భాష (తెలుగు/హిందీ) మినహాయించి మిగతా అన్ని సబ్జెక్టులకు రెండేసి పేపర్ల చొప్పున పరీక్షలు (మొత్తం-11)నిర్వహిస్తున్నారు. ఇకపై తెలుగు, హిందీ, ఆంగ్లం సబ్జెక్టులకు ఒక్కో పేపరు మాత్రమే నిర్వహిస్తారు. భాషేతర విషయాలైన విజ్ఞానశాస్త్రం, సాంఘికశాస్త్రం, గణితాల్లో రెండేసి పేపర్లు యథాతథంగా (మొత్తం-9) ఉంటాయి.

* ప్రతి సబ్జెక్టులో 80 శాతం మార్కులకు పబ్లిక్ పరీక్షలు, మిగిలిన 20 శాతం మార్కులకు అంతర్గత నిర్మాణాత్మక మూల్యాంకనం (ఫార్మెటివ్ అసెస్మెంట్) ద్వారా కేటాయిస్తారు.

* ప్రతి సబ్జెక్టులో తప్పనిసరిగా 35 శాతం మార్కులు పొందితేనే ఉత్తీర్ణులైనట్లు గుర్తిస్తారు. గతంలో ద్వితీయ భాష హిందీలో 20 శాతం మార్కులువస్తే ఉత్తీర్ణులైనట్లు గుర్తించారు. ఇకపై ఈ సబ్జెక్టులోనూ 35 శాతం మార్కులు పొందాలి.

* ప్రస్తుతం పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో జవాబులు రాసేందుకు ప్రధాన వాబుపత్రంతోపాటు అవసరమైతే అదనపు జవాబుపత్రాలను అందిస్తున్నారు. వీటికి పరిమితి లేదు. ఇకపై ఈ విధానానికి స్వస్తి పలికి ఒకే జవాబుపత్రాన్ని (ఆన్సర్ బుక్లెట్) ఇవ్వాలని విద్యాశాఖ ప్రతిపాదించింది.

* అన్ని పాఠశాలలకు ఉత్తర్వుల వర్తింపు

పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో, తొమ్మిదో తరగతి పరీక్షల్లో కొత్త విద్యా సంవత్సరం నుంచి రానున్న మార్పులు ప్రభుత్వ, ప్రభుత్వ పరిధిలోని పాఠశాలల్లోనే కాకుండా ప్రైవేట్ పాఠశాలలకూ వర్తిస్తాయి

Similar Posts:

    None Found

Posted by 0 Responses
     

Leave a Reply to this Post

May
31
2014
 
 

Categories

Get Free Email Alerts