CONTENTCARRY


Latest & upcoming jobs in Telangana- 107744 posts

 

తెలంగాణలో మొత్తం ఖాళీలు 1,07,744

ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు 1,07,744 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వీటి భర్తీకి ఉన్న అవరోధాలన్నీ ఇటీవల తొలగిపోయాయని, వీటిని దశలవారీగా భర్తీ చేస్తామని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ శాసనసభలో ప్రకటించారు. ఇప్పటికే అన్ని ప్రభుత్వ శాఖల నుంచి ఖాళీల వివరాలు తెప్పిస్తున్నామని, ప్రాథమిక సమాచారం ప్రకారం 1.07 లక్షల ఖాళీలున్నట్లు తెలిసిందని వివరించారు. మొత్తం ఉద్యోగాల్లో 85 శాతం స్థానికులతో భర్తీ చేయాల్సినవే ఉన్నాయని, రాష్ట్రస్థాయి క్యాడర్ పోస్టులు 15 వేల వరకే ఉంటాయని తెలిపారు.

నేరుగా నిరుద్యోగులతో నియమించాల్సిన కేటగిరీలో దాదాపు 55,878 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వీటిలో పబ్లిక్ సర్వీసు కమిషన్ ద్వారా భర్తీ చేయాల్సినవి 18,616 వరకూ ఉన్నట్లు ప్రాథమికంగా తేలిందన్నార

ఇప్పటికి అందిన వివరాల ప్రకారం ఇలా నిబంధనల ప్రకారం ఉద్యోగాల్లో చేరిన ఒప్పంద ఉద్యోగులు సుమారు 25 వేల మంది వరకూ ఉన్నారని, వీరి ఉద్యోగాలను క్రమబద్ధీకరించేందుకు మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. పొరుగుసేవల విధానంలో నిబంధనల ప్రకారం చేరిన వారు 20 వేల మంది వరకూ ఉంటారని, కానీ సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన వివిధ తీర్పుల ప్రకారం పొరుగుసేవల ఉద్యోగాలను క్రమబద్ధీకరించడం సాధ్యం కాదని మంత్రి స్పష్టం చేశారు. కానీ పొరుగుసేవల ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిశీలించి వారికి విధంగా న్యాయం చేయాలో ఆలోచిస్తున్నట్లు చెప్పారు. ఉద్యోగ పరీక్షలు ఉర్దూలో సైతం నిర్వహించేందుకు పరిశీలన జరుపుతున్నట్లు చెప్పారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో వివిధ కేటగిరీల ఉద్యోగాలెన్ని అవసరం అన్నదానిపై మరోసారి పరిశీలిస్తున్నామని తెలిపారు. గతంలో 2008లో పరిశీలన జరిపినట్లు తెలిపారు. విద్య, వైద్య రంగాల్లో ప్రభుత్వ సేవలే చాలా కీలకం అని, పేదలకు మంచి విద్య అందించేందుకే కేజీ టూ పీజీ పథకం తెస్తున్నామని తెలిపారు. మంత్రి హరీష్రావు మాట్లాడుతూ.. ఒప్పంద ఉద్యోగుల్లో ఖజానా నుంచి జీతం తీసుకున్నవారి ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తామనే మాటకే కట్టుబడి ఉన్నామని చెప్పారు. సింగరేణి, జెన్కో వంటి సంస్థల్లో కొత్త ఉద్యోగాలు పెద్దసంఖ్యలో వస్తాయని తెలిపారు.

Similar Posts:

Posted by 0 Responses
     

Leave a Reply to this Post

Mar
25
2015
 
 

Categories

Get Free Email Alerts